యూపీ సర్కార్ బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు కూల్చివేతలకు చేపట్టొద్దని ఇప్పటికే ఆదేశించగా.. వాటిని మరోసారి గుర్తు చేసింది. ‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అతిక్రమించాలని అనుకుంటున్నారా?’ అని పేర్కొంది.