TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని, పూర్తిస్థాయి హోంమంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని, ఇకనైనా శాంతి భద్రతలపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆందోళనపై కేటీఆర్ స్పందించారు. కొన్ని నెలలుగా తాము చెప్తున్నదే ఇవాళ జీవన్‌రెడ్డి విషయంలో జరుగుతుందన్నారు.