తండ్రి చేసిన తప్పిదంతో టీమిండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్పై వేటు పడింది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని జింఖానా క్లబ్ ప్రకటించింది. జేమీమా సభ్యత్వాన్నిఉపయోగించుకుని తండ్రి ఇవాన్ నిబంధనలను అతిక్రమించి క్లబ్ వేదికగా పలు మతపరమైన కార్యక్రమాలు చేపట్టారని ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లబ్ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై జేమీమాకు పూర్తి సమాచారం అందించినట్లు స్పష్టం చేశారు.