KRNL: గాజులపల్లెలోని శ్రీ రాఘవ ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో రూ.1.15 లక్షల విలువ చేసే 5.25 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్టాక్ రిజిస్టర్లోని ఎరువుల నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో పాటు సరైన ధ్రువపత్రాలు చూపించలేదని చెప్పారు.