AP: రైతులకు 50 శాతం రాయితీతో టార్పాలిన్లు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో చేబ్రోలులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని అధికారులకు సూచించారు.