HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ (డి.ఆర్.ఎస్.సి) సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు.