»Zaheerabad Mp Bb Patil Is Going To Join Bjp Today Evening In Presence Of Jp Nadda
Telangana : బీఆర్ఎస్కు షాక్.. బీజేపీ గూటికి మరో ఎంపీ
లోక్సభ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది ఎంపీలు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు మరో ఎంపీ కూడా బీజేపీలో చేరారు.
Telangana : లోక్సభ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది ఎంపీలు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు మరో ఎంపీ కూడా బీజేపీలో చేరారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ చేరుకున్న పాటిల్.. పార్టీ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. బీబీ పాటిల్ ఇప్పటికే తన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ పంపారు. జహీరాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు బీబీ పాటిల్ తన లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.
2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీబీ పాటిల్ అదే ఏడాది జహీరాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కార్పై పోటీ చేసి గెలుపొందారు. 2019లో మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై 6166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఇప్పుడు ఎంపీలంతా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు రాజీనామా చేశారు. వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. రాములు బీజేపీలో చేరారు.