»Wines Bandh For Those Three Days In Telangana Orders Issued
Telanganaలో ఆ మూడు రోజులు వైన్స్ బంద్.. ఉత్తర్వులు జారీ
తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరుసగా మూడు రోజులు మద్యం అమ్మకాలు బంద్ పెట్టనున్నారు.
తెలంగాణ (Telangana) ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28,29,30 తేదీల్లో రాష్ట్రంలోని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మూడు రోజుల్లో అన్ని వైన్స్‌లు, బార్లు మూసివేయనున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈ నెలాఖరున మద్యం విక్రయాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Excise Dept) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వైన్ షాపుల యజమానులు, బార్ల యజమానులను అలర్ట్ చేయాలని ఉత్తర్వులు (Orders) జారీ చేశారు. పోలింగ్ వేళ.. ఓటర్లను ఏ పార్టీ నేతలు కూడా ప్రభావితం చేయకూడదని ఉద్దేశంతోనే.. ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఇప్పటికే ఎన్నికల ప్రచార పర్వం మొదలవగా.. చాలా చోట్ల మద్యం పంపిణీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. తనిఖీల్లోనూ.. అక్రమంగా తరవిస్తోన్న అక్రమ మద్యాన్ని పోలీసులు (Police) స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా.. గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం.. ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నామినేషన్ల పర్వం మొదలు కాగా.. పోలింగ్ (Polling) మరో పది రోజులు ఉందనగా.. మద్యం పంపిణీ ఊపందుకుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు బెల్లు షాపులను మాట్లాడి పెట్టుకుని.. ఓటర్ల (Voters)కు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం చిన్న సమచారం అందినా తనిఖీలు చేస్తూ.. వారి ప్లాన్లను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.