తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలలకు పెద్ద పీట వేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు. ఆ తర్వాత పట్టించుకునే వారే లేరు. మెట్ పల్లి గురుకుల పాఠశాలలో మంచినీటి సమస్య ఉంది. పైఅధికారులకు చెప్పినప్పటికీ ఫలితం లేదు. దీంతో వేములకుర్తి సర్పంచ్ నవ్య శ్రీ సత్యం ముందుకొచ్చారు. తన సొంత డబ్బులతో పాడయిన మోటార్ బాగు చేయించారు. ఇందుకోసం రూ.లక్ష వరకు ఖర్చయ్యింది. పిల్లల సమస్య ఉండొద్దనే మోటార్ బాగు చేయించానని సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ పాఠశాలలో తన కూతురు చదువుకుందని, 9.8 గ్రేడ్ సాధించిందని తెలిపారు. కార్యక్రమంలో కొండ్రికర్ల ఉప సర్పంచ్ రాజేశ్వర్, పేరంట్స్ కమిటీ సభ్యులు రాజేందర్, నారాయణ, శంకర్, ప్రశాంత్, మనోజ్ తదతరులు పాల్గొన్నారు.