»Three Devotees Died Of Suffocation In The Saleswaram Fair
Nagar Kurnool : సలేశ్వరం జాతరలో ఊపిరాడక ముగ్గురు భక్తులు మృతి
సలేశ్వరం జాతరలో (Salesvaram jatara) విషాదం చోటు చేసుకుంది. ఊపిరి ఆడక ముగ్గురు భక్తులు మృతి చెందారు. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా(Amarnath Yatra) పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు
సలేశ్వరం జాతరలో (Salesvaram jatara) విషాదం చోటు చేసుకుంది. ఊపిరి ఆడక ముగ్గురు భక్తులు మృతి చెందారు. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా(Amarnath Yatra) పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు. వనపర్తి (Vanaparthi) పట్టణానికి చెందిన అభిషేక్ (32), ఆమన్ గల్ కు చెందిన విజయ్ (40) ఊపిరి ఆడక చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం జాతరకు ఈ సారి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో సలేశ్వరం ఆలయం వద్దకు వెళ్లే దారిలో యాత్రికులు బారులు తీరారు. మన్ననూర్ (Mannanur) నుంచి సలేశ్వరం జాతరకు వచ్చే మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సలేశ్వరం జాతర కనీసం వారం నుంచి 10 రోజులపాటు నిర్వహించాలి. కానీ ఈ సారి కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.
దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో రద్దీ కారణంగా ఊపిరాడక భక్తులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో(Nallamala aḍavullo) ఉన్న సలేశ్వరంలో కొలువై ఉన్న లింగమయ్య దర్శనం కోసం దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 5 కిలో మీటర్ల దూరం కాలినడకన నడవాలి. ఉగాది తర్వాత తొలి పౌర్ణమికి(Paurṇami) జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు (Tamil Nadu) నుంచి యాత్రికులు లక్షలాదిగా తరలివస్తారు. అయితే ఈ ఏడాది సలేశ్వరం ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అడవిలోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ సారి యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.