ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది. తమిళనాడు (Tamil Nadu) తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరుకూ ఉన్న పాత వాహనాలు (Old vehicles) మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి. ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి AP 39 సిరీస్ లో నెంబర్లు కేటాయిస్తోంది. ఇక మీద నూతన రిజిస్ట్రేషన్ (New registration) సిరీస్ తీసుకురావడంతో ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు.