»This Is The Last Warning To Mlas Who Collect Money Cm Kcr
CM KCR : డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్ : సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ (CM KCR) వార్నింగ్ ఇచ్చారు. దళితు బందు లబ్థి చేకూర్చేందుకు కొందరు నాయకులు రూ.3 లక్షల వరుకు వసూళ్లు చేశారని, వారి చిట్టా తన వద్ద ఉందని తీవ్ర వాఖ్యలు చేశారు. ఇదే చివరి వార్నింగ్ అని, మళ్లీ వసూళ్లు చేస్తే టికెట్ దక్కదని సీఎం హెచ్చారించారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అని సష్టం చేశారు.
రాష్ట్రంలో దళితబంధు (Daḷitabandhu) పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లో తెలంగాణ భవన్లో జరిగిన ప్రతినిధుల సర్వసభ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్.. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి వార్నింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. మరోసారి తప్పు చేస్తే పార్టీ నుండి తప్పిస్తామని స్పష్టం చేశారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇళ్ల విషయంలోను ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్నారు. స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి(Kadiam Srihari)లకు ఈ సందర్భంగా సున్నిత హెచ్చరికలు జారీచేశారు. పార్టీ కోసం కలిసి పని చేయాలి: వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా… పార్టీ కోసం కలిసి పని చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని… మిగతా నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సమస్యే ఉంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని చెప్పారు. నాయకులందరూ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని… ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానంతో విన్నవించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని చెప్పారు.దళిత బందుపై ప్రతిపక్షాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు.