Plastic surgery : ప్లాస్టిక్ సర్జరీ… వికటించడంతో మోడల్ మృతి
సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులారిటీ అందుకున్న అందాల భామ కిమ్ కర్డాషియన్ (Kim Kardashian). అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు, శరీర ఆకృతి, తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది.
గత కొన్నేళ్ల నుంచి మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీ(Plastic surgery), లైపో సర్జరీలు చేయించుకుంటున్న నటీమణుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గితే హీరోయిన్లు వెంటనే ప్లాస్టిక్ సర్జరీ, లైపో సర్జరీలు చేయించుకుని కొత్త లుక్(new look) తో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కాలిఫోర్నియా(California) అందాల భామ కిమ్ కర్డాషియన్ మోడలింగ్ ద్వారా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సర్జరీల అనంతరం అచ్చం కిమ్ కర్డాషియన్ లా ఉందే అనిపించుకుని మురిసిపోయింది. కిమ్ కర్డాషియన్ ను పోలి ఉండడంతో ఆమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమలో 34 ఏళ్ల గౌర్కానీ… మరో సర్జరీ చేయించుకుని, అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం గౌర్కానీ తీవ్ర గుండెపోటుకు గురైందని, ఆమె మరణానికి కారణం అదేనని వారు వెల్లడించారు. సర్జరీ నేపథ్యంలో, గుండె పనితీరుకు అవాంతరాలు ఏర్పడ్డాయని, గుండె ఆరోగ్యం క్షీణించడానికి నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కారణమని మేయో క్లినిక్ (Mayo Clinic) వర్గాలు తెలిపాయి.