»There Is No Development As Long As There Are Slavish Political Leaders Rsp
BSP : గులాంగిరి చేసే బానిస రాజకీయ నేతలు ఉన్నంతవరకు అభివృద్ధి శూన్యం : RSP
సీఎం సీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిందే పెద్ద కుట్ర అని బీఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) ఆరోపించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ (BSP) కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
సీఎం సీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిందే పెద్ద కుట్ర అని బీఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) ఆరోపించారు. శనివారం అలంపూర్ చౌరస్తాలోని బీఎస్పీ (BSP) కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 26న బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ నిరంకుశ పాలనలో ప్రజలు చింద్రమైపోయి వారి బతుకులు నాశనమైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉందని మండిపడ్డారు.రూ. 1000 కోట్లు గజ్వేల్ కి పెట్టినప్పుడు మరి అలంపూర్ (Alampur) ప్రజలు ఏం పాపం చేశారని అలంపూర్ అభివృద్ధి కోసం బడ్జెట్ (Budget) ఎందుకు పెట్టలేదని మండిపడ్డారు. రెండు సార్లు ఓటు వేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కదా! బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధుల దృష్టిలో అలంపూర్ ప్రజలంటే చులకన భావం ఉన్నది కాబట్టే దౌర్జన్యం చేస్తే భయపడతారని బడ్జెట్లో పెట్టలేదని ఆరోపించారు.
ఇక్కడ ఉన్న అసమర్థత ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి గులాం గిరి చేయబట్టే ఇక్కడి ప్రజలు అభివృద్ధి నోచుకోనిస్థితి వచ్చిందని మండిపడ్డారు. నోరులేని బానిసలైన ప్రజాప్రతినిధులు అవసరం లేదని ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారే ముఖ్యమని, అందుకోసమే బీఎస్పీ బహుజన రాజ్యాధికారం యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ (BRS)నాయకుల్లారా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు? మీకు దమ్ముంటే ముఖ్యమంత్రితో కొట్లాడి అలంపూర్ (Alampur) ను అభివృద్ధిలో పథంలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీళ్ల కోసం కొట్లాట.. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కూడా నీళ్ల కోసం కొట్లాట తప్ప లేదన్నారు. ఓట్ల కోసమే తుమ్మిళ్లను వాడుకుంటున్నారే తప్ప రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ సస్యశ్యామలంగా ఉండాలి కానీ అలంపూర్ (Alampur) మాత్రం ఎండిపోవాలా అని ప్రశ్నించారు.
అదేవిధంగా జనవరి 29న ముస్లిం మైనారిటీ అయిన ఖదీర్ ఖాన్ (Qadeer Khan) అనే అతనిని మెదక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఘోరంగా టార్చర్ చేసి హింసిస్తే వారం రోజుల క్రితం గాంధీ (Gandhi)హాస్పిటల్ లో అతను చనిపోతే అందుకు కారకులైన అధికారులను సస్పెండ్ చేశారే తప్ప ఎందుకు కేసు నమోదు చేయలేదని డిమాండ్ చేశారు. ఉన్నత స్థాయి విచారణ చేపట్టకుండా తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో( KU) మెడికో విద్యార్థి ప్రీతి విషయంలో కారకులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదని డిమాండ్ చేశారు. తెలంగాణలో దోపిడీ పాలన పోయి బహుజన రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.