»The Telangana Cabinet Met On The 9th Of This Month And Discussed Various Issues
Cabinet meeting : తెలంగాణ కేబినెట్ ఈ నెల 9న భేటీ పలు అంశాలపై చర్చ
తెలంగాణ కేబినెట్(Telanganac మార్చి9న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ కేబినెట్(Telanganac మార్చి9న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సొంత ఇళ్ల స్థలాలు ఉన్న వారికి, ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం (Financial assistance) అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రెండు పడక గదుల ఇళ్లు మంజూరు అయి నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కూడా నిర్ణయించింది. అంతే కాకుండా గతంలో ప్రవేశ పెట్టిన రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని సూచించింది. ఈ విషయాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు గవర్నర్ (Governor)దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి కూడామంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది . ఇతర కీలక పథకాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేనున్న కొత్త క్రీడా విధానంపై సిద్ధమైన ముసాయిదాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని (Rural areas) ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెస్ ఛార్జీల (Mess charges)పెంపుదలకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పోడు భూములపై (Podu bhumulu) హైకోర్టు నోటీసులకు సమాధానం ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కొత్త పీఆర్సీ (New prc) కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది