»The People In The State Are In A State Of Turmoil
Weather dept : రాష్ట్రంలో మండుతున్న భానుడు బెంబేలెత్తుతున్న ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతన్నాయి. భానుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ (Hyderabad) జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సింగరేణి (Singareni) బెల్ట్ లో ఈ వడగాలులు అధికంగా వీస్తున్నాయి. వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు (DH SrinivasaRao) సూచించారు.భానుడి భగభగలకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వేసవితాపం తీవ్రతకు వడదెబ్బ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ(Weather dept) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సూచనలను తీసుకోవలనిహెల్త్ డైరెక్టర్ (Director of Health) కోరారు.
రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో భయటకు రావాలంటనే ప్రజలు హడలిపోతున్నారు. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండలు మరింత మండిపోతున్నాయి. నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా తయారవుతోంది హైదరాబాద్ (Hyderabad) రోడ్ల పరిస్థితి. మధ్యహ్నం 1 నుంచి 3 గంటల సమయంలో గ్రేటర్లోని ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు ప్రయాణికులు లేక నిర్మానుషంగా మారాయి. ఎల్బీనగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హైటెక్ సిటీ (Hi-Tech City), మదాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక (Tarnaka) ఇలా అన్ని ఫ్లై ఓవర్లు, రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో ఈ రోజు ఒకరు మృతి చెందారు. తెలుగు రాష్ట్రలో వడగాలతో 13 మంది మృత్యు వాత పడ్డారు