»The Cms Exercise On Organizing The States Decade Celebrations Is In Full Swing
CM KCR : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం
దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ (CM KCR) మంత్రులు, ప్రభుత్వ అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. 21 రోజులపాటు నిర్వహించే దశాబ్థి ఉత్సవాలకు సంబంధించిన క్యాలెండర్ సిద్దం చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై మంత్రులు ఆయా శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మూడు వారాల పాటు వివిధ రంగాల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేశారు.రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఊరూరా పండగలా.. ఘనంగా నిర్వహించాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని సీఎం తెలిపారు. గ్రామాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని 23 రోజుల పాటు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. పదేళ్లల్లో ఏ ఏ పథకాలు వచ్చాయి.. వాటి ఫలాల వల్ల జరిగిన ప్రయోజనం వివరించాలని సూచించారు. పల్లె ప్రగతి(Palle pragati)తో గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు (Sports grounds) ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ అభివృద్ధిపై దండోరా వేసి ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గత 9 ఏండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న హైదరాబాద్(Hyderabad)లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాలపై రూపొందించే డాక్యుమెంటరీల గురించి సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) మాట్లాడుతూ ఆయా శాఖలు సాధించిన విజయాలను చాటిచెప్పేలా శాఖలవారీగా డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.