తెలంగాణ పోలీస్(telangana police) SI హాల్ టికెట్లు పరీక్షకు 5 రోజుల ముందే నేడు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో అభ్యర్థులు హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ చేసుకుని పరీక్ష సమయం, కేంద్రాన్ని చూసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థుల SI హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ క్రమంలో అభ్యర్థులు SI పరీక్ష తేదీ, సమయం, కేంద్రాన్ని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్ కోసం TSLPRB అధికారిక వెబ్సైట్ www.tslprb.inని సందర్శించాలని కోరారు.
తెలంగాణలో ఇప్పటికే ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic), మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ (Language Paper) పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ పరీక్షలకు తెలంగాణలోని(Telangana) 10 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నియామక మండలి ప్రకటించింది. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే support@tslprb.in లేదా 9393711110/9391005006 నెంబర్లను సంప్రదించాలని తెలిపింది.