»Reduction In All Types Of Crimes Except Cyber Crimes In The State Dgp Anjani Kumar
DGP AnjaniKumar : రాష్ట్రంలో అన్ని నేరాలు తగ్గాయి: డీజీపీ
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు(cyber crimes) తప్ప మిగతా అన్ని రకాల నేరాలు తగ్గాయని డీజీపీ అంజనీ కుమార్(DGP AnjaniKumar) ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ(cyber literacy) గణనీయంగా పెరిగిందని దాంతో పాటే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు.
DGP AnjaniKumar : తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు(cyber crimes) తప్ప మిగతా అన్ని రకాల నేరాలు తగ్గాయని డీజీపీ అంజనీ కుమార్(DGP AnjaniKumar) ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ(cyber literacy) గణనీయంగా పెరిగిందని దాంతో పాటే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్ లపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి. లతో డీజీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్(
video conference) ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సి.ఐ.డి అడిషనల్ డీజీ మహేష్ భగవత్(Mahesh Bhagwat), మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, రేంజ్ ఐజి లు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, సైబర్ నేరాలకు సంబంధించి వచ్చే ప్రతీ ఫిర్యాదుపై కేసును నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో వ్యక్తిగత నేరాల మినహా మిగిలిన నేరాలన్నింటిలోనూ తగ్గుదల ఉందన్నారు.
పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల మనసులు చూరగొనాలన్నారు. పెరిగిపోతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. శాంతి భద్రతల(peace security) పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్(community policing) లో సిసి కెమెరాల(CC Camera) ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు .
డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ(center of excellence) చేసిన సమీక్ష అనుసరించి రాష్ట్రంలోని మొత్తం 700 పోలీస్ స్టేషన్లలో 330 పోలీస్ స్టేషన్లు అద్భుతమైన పని తీరును కనబరిచాయన్నారు. ఇదేవిధమైన ఉత్తమ సేవలందించేందుకై మిగిలిన పోలీస్ స్టేషన్ల పనితీరును రెగ్యులర్ గా సమీక్షించాలని సి.పీ(CP) లు, ఎస్.పీ(SP) లను కోరారు. బ్లూ కోట్స్ పనితీరు అంశంలో ఉత్తమ పనితీరును కనపరిచిన పలు కమీషనరేట్లను, ఎస్.పీ లను డీజీపీ అభినందించారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ను ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభ చూపిన పోలీస్ అధికారులకు సత్కారం
సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల(DAV School) POSCO కేసు విషయంలో త్వరిత గతిన దర్యాప్తు పూర్తిచేసి నిందితునికి 20 ఏళ్ల శిక్ష, నగదు జరిమానా విధించడంతో కృషిచేసిన దర్యాప్తు అధికారులు ప్రతాప్ రెడ్డి, బంజారాహిల్స్ ఎస్.హెచ్.ఓ నరేందర్ లను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. వీరికి పుష్పగుచ్చంతోపాటు ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికపై అత్యాచారానికి సంబందించిన కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిఖపడడంలో కృషి చేసిన అడిషనల్ డీసీపీ శివ కుమార్, ఎస్.హెచ్.ఓ నరేందర్ గౌడ్ లను డీజీపీ సన్మానించారు. అదేవిధంగా, శివ సాగర్ అనే నిందితున్ని 18 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్లు వెంకటేష్, శ్రీనివాస్, ఎస్.పీ రాంరెడ్డి లను కూడా డీజీపీ సన్మానించారు.