»Telangana Police Arrested A Person In Cheated To Bellampalli Durgam Chinnaiah
Girl పేరుతో ఎమ్మెల్యే చిన్నయ్యను బురిడీ కొట్టించిన ఆకతాయి
సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ మొత్తం వ్యవహారం బహిర్గతం చేసింది. అయితే ఎమ్మెల్యే తన అధికార బలంతో ఆ కేసును మరుగున పడేశారని సమాచారం. మరుగునపడేసినా ఆ కేసు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై (Durgam Chinnaiah) తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్నాడని ఒక యువతి (Women) పోలీస్ స్టేషన్ గడప తొక్కిన సంఘటన సంచలనం రేపింది. అయితే ఆ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందో? ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ. ఆ కేసు మాత్రం ఎమ్మెల్యేను ఒక ఆడుకుంటోంది. తాజాగా ఆ కేసులోనే సాక్ష్యాలు, ఫొటోలు (Photos) తన దగ్గర ఉన్నాయంటూ ఓ ఆకతాయి ఎమ్మెల్యేను బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయి పేరిట చాట్ చేస్తూ ఎమ్మెల్యే నుంచి డబ్బులు వసూల్ చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన వివరాలు మంచిర్యాల జిల్లా (Mancherial District) బెల్లంపల్లి ఒకటో పట్టణ ఎస్ హెచ్ఓ శంకరయ్య వెల్లడించారు.
ఆరిజన్ డెయిరీ విషయంలో ఎమ్మెల్యే, యాజమాన్యానికి మధ్య తీవ్ర వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యేపై యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసింది. సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ మొత్తం వ్యవహారం బహిర్గతం చేసింది. అయితే ఎమ్మెల్యే తన అధికార బలంతో ఆ కేసును (Case) మరుగున పడేశారని సమాచారం. మరుగునపడేసినా ఆ కేసు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఈ కేసులో తన వద్ద ఫొటోలు, వీడియోలు ఉన్నాయంటూ ఓ అమ్మాయి పేరుతో ఏప్రిల్ 23వ తేదీన ఎమ్మెల్యేకు సందేశంతోపాటు వాట్సప్ లో సంప్రదించాడు. యువతి పేరిట ఎమ్మెల్యేతో చాట్ (Chat) చేశాడు. రూ.90 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి (Bellampalli) ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఎల్లారెడ్డి మండలం అజమాబాద్ కు చెందిన ఎండీ ఇషాక్ ఆ సందేశాలు పంపినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే ఇషాక్ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.