konugolu kendralu : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ (Telangana) రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పంది. యాసంగి వరి (Yasangi rice) ధాన్యం కోనుగోలు కేంద్రాలను యుద్దప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari), సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశించారు.
తెలంగాణ (Telangana) రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పంది. యాసంగి వరి (Yasangi rice) ధాన్యం కోనుగోలు కేంద్రాలను యుద్దప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari), సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్ ను సీఎం కోరారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటిని ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు(Dhanyam konugolu kendralu) ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ సూచించారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధర (Price) అందించేందుకు ప్రభుత్వం ఏటా దాదాపు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తుంది. ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే నేరుగా జమచేస్తున్నారు. ఈ ఏడాది గ్రేడ్ వన్(Grade one) కు రూ.2060, సాధారణ వరి రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం నిర్ణయించింది.గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.