kodandaram:మార్చి 10న తెలంగాణ బచావో.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ
kodandaram:తెలంగాణ వాదం మరింత బలంగా వినిపించింది మిలియన్ మార్చ్ (million march). మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (telangana bachao) సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొపెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను (wall poster) ఆయన ఆవిష్కరించారు.
kodandaram:తెలంగాణ వాదం మరింత బలంగా వినిపించింది మిలియన్ మార్చ్ (million march). మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (telangana bachao) సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొపెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను (wall poster) ఆయన ఆవిష్కరించారు. సకల జనులు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యిందని పేర్కొన్నారు. కేసీఆర్ (kcr) ఒక్కరి వల్లే రాష్ట్రం ఏర్పడలేదని స్పష్టంచేశారు. చావు నోట్లో తలపెట్టి, అటుకులు తిని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చానని సీఎం కేసీఆర్ (kcr) ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 4 కోట్ల మంది జనం ఉద్యమిస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) గురించి కోదండరామ్ (kodandaram) ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ (cm kcr) అధికారాన్ని ఎలా వాడుకున్నారో అర్థమవుతుందని చెప్పారు. ఒకే కుటుంబం ఢిల్లీ (delhi) స్థాయిలో స్కామ్ చేసి వాటాలు పొందాలని చూసిందని తెలిపారు. బీఆర్ఎస్ (brs) నేతల భూ ఆక్రమణలకు ధరణి ఫోర్టల్ (dharani portal) చక్కగా పనిచేస్తుందని తెలిపారు. భూ ఆక్రమణలతో కేసీఆర్ (kcr) కుటుంబం ఆస్తులు పెంచుకుంటుందని కోదండ రామ్ (kodandaram) విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ (kcr) చెప్పింది ఏంటీ.? ఇప్పుడు చేసేదీ ఏంటీ అని అడిగారు. కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఫైరయ్యారు. ఢిల్లీలో (delhi) అత్యంత ప్రజాస్వామ్య వాదిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. అదే తెలంగాణ (telangana) రాష్ట్రంలో నియంతృత్వ వాదిగా బిహెవ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ (kcr) వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు.
చదవండి:governer on preethi:ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలింపు, సమయం వేస్ట్: ప్రీతి మృతిపై గవర్నర్
తెలంగాణ ఉద్యమానికి మిలియన్ మార్చ్ (million march) ఊపిరిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఉద్యమం చేసేందుకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని వివరించారు. ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో (telangana bachao) సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని కోదండరామ్ (kodandaram) చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే సదస్సులో పాల్గొంటారని వివరించారు. సదస్సులో ఇచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం అని ప్రొఫెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు.
చదవండి:Water leak in SUV:‘ఏ సన్‌రూఫ్ వాటర్‌ప్రూఫ్’ కాదు.. వాటర్ ఫాల్ కింద కారు, నీరు రావడంతో
తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా కోదండరామ్ (kodandaram) వ్యవహరించారు. ఉద్యమంలో కీ రోల్ పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మాత్రం కేసీఆర్‌తో (kcr) దూరం దూరంగానే ఉన్నారు. గత ఎన్నికలకు ముందు తెలంగాణ జన సమితి (tjs) అని పార్టీ ఏర్పాటు చేశారు. మహాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ సీట్ల పంపకం చాలా ఆలస్యమైంది. ఈ లోపు టీఆర్ఎస్ అభ్యర్థులు.. నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసి జనం దృష్టిలో పడ్డారు. ఆ పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది.