»Tarakaratnas Wife Alekhyas Emotional Post About Balayya
బాలయ్య గురించి తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకత్న (Nandamuri Tarakatna) ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి (TDP) శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. తాజాగా బాలయ్య గురించి తారకరత్న భార్య సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.
నందమూరి తారకత్న (Nandamuri Tarakatna) ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయవేత్తగా కూడా చురుకుగా ఉండే తారకరత్న.. జనవరి (January) నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్(Nara Lokesh) మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి (TDP) శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. ఈ విషాదం నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇంకా కోలుకోలేకపోతున్నారు. తాజాగా బాలయ్య గురించి ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.
సుఖ, దుఃఖాల్లో ధైర్యంగా చివరి వరకు వెంట ఉన్న వ్యక్తి ఆయన, ఒక తండ్రిలా హాస్పిటల్ (Hospital)లో దగ్గర ఉండి చూసుకున్న వ్యక్తి ఆయన. అమ్మలా నవ్విస్తూ, నిద్రపుస్తూ.. చుట్టూ ఎవరు లేనప్పుడు మా కోసం కన్నీరు కార్చే వ్యక్తి ఆయన. ఈ ఫోటోని ఎవరైతే ఎడిట్ చేసారో వాళ్ళకి చాలా పెద్ద థాంక్యూ అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం తారకరత్న పిల్లల భాద్యత బాలకృష్ణ (Balakrishanna) తీసుకున్నాడు. వారి భవిషత్తు తన భాద్యత అంటూ బాలకృష్ణ, ఎంపీ విజయ్ సాయి రెడ్డికి (Vijay Sai Reddy) మాట ఇచ్చిన విషయం తెలిసిందే. మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి అని. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం… ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెల్లిపోయావు. మిస్ యూ సోమచ్’ అని అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ (Emotional post)పెట్టారు.