Hyderabad: షాకింగ్..హైదరాబాద్‌లో ఇల్లు ఇక కష్టమే..!
అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి.
హైదరాబాద్(Hyderabad)లో ఇక ఇల్లు(House) కొనడం కష్టంగా మారే పరిస్థితి వస్తోంది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్(Real Estate) మార్కెట్ అతి వేగంగా ముందుకు సాగుతోంది. సిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో పారిశ్రామిక పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఆదాయం వస్తోంది. ఐటీ కంపెనీలకు నిలయంగా ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు(International companies) నగరానికి క్యూ కడుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాల(Metro cities) కంటే హైదరాబాద్ ముందంజలో నిలిచింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో గత ఐదేళ్లలో భారీగా పెట్టుబడులు పెరిగాయి.
2021-22 అన్‌రాక్ నివేదిక ప్రకారంగా దేశంలోని 7 మెట్రో నగరా(Metro cities)ల్లో హైదరాబాద్(Hyderabad) మొదటి స్థానంలో ఉంది. భాగ్యనగరంలో నలువైపులా రవాణా సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా, మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు కూడా తక్కువ కావడంతో ఉపాధి వలసలు పెరిగాయి. దీంతో ఇక్కడే శాశ్వత నివాసాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న హైదరాబాద్(Hyderabad) నగరంలో ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో రూ.2,230 కోట్ల వరకూ ఇళ్ల కొనుగోళ్లు జరిగాయని, మొత్తం 4,398 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. ఢిల్లీలో వాయు కాలుష్యం, బెంగళూరులో మౌలిక సదుపాయాల కొరత సమస్యలు ఉండటంతో ఇక అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. మరోవైపు భాగ్యనగరంలో ఇల్లు కొనడం ఇక కష్టంగానే మారుతోంది. ధరల పెరుగుదలతో నగరంలో