ఫుట్బాల్ స్టేడియం(Football Stadium)లో తొక్కిసలాట జరిగి 12 మంది(12 died) మృతిచెందిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. సెంట్రల్ అమెరికా రాజధాని ఎల్ సాల్వడార్లోని కస్కట్లాన్ ఫుల్ బాల్ స్టేడియం ఉంది. ఈ స్టేడియంలోకి ప్రేక్షకులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు తీయడంతో అనేక మంది గాయాలపాలయ్యారు. ఘటనలో 12 మంది మృతిచెందారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కస్కట్లాన్ ఫుట్ బాల్ స్టేడియం(Football Stadium)లో అలియాంజా ఎఫ్సీ, క్లబ్ డిపోర్టివో ఎఫ్ఎఎస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా విషాదం చోటుచేసుకుంది. ఈ స్టేడియంలో 44 వేల మంది మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ జరుగుతుండగా అభిమానులంతా ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకొచ్చారు. తొక్కిసలాట జరగడంతో టోర్నమెంట్ ను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.