వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఆమె విమర్శల యుద్ధం చేశారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో 8000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈసందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న నాందేడ్ లో జరిగిన సీఎం కేసీఆర్ సభ గురించి ఆమె ప్రస్తావించారు. మహారాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి కేసీఆర్ మాట్లాడటం బాగానే ఉంది కానీ.. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆయనకు తెలుసా? ఎన్సీఆర్బీ, తెలంగాణ పోలీస్, రైతు స్వరాజ్ వేధిక వాళ్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది. గత 8 ఏళ్లలో 8 వేల మంద రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతుల జీవితాలకు విలువ లేదా? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
NCRB, Telangana police, Raithu Swaraj Vedhika reports give offical figure that 8000 farmers committed suicide in Telangana in the last 8 years. Don't their lives have any value?: YSRTP chief YS Sharmila pic.twitter.com/gtJo6IslYU