»Senior Actor Naresh Complaints To Ccs Police On Youtube Channels
Youtube Channelsపై నటుడు నరేశ్ ఆగ్రహం.. నా పరువు పోతోంది
పని గట్టుకుని తప్పుడు ప్రచారాలు, అసభ్యకర కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించాడు. యూట్యూబ్ చానల్స్ వాళ్లు ఇష్టారీతిన తన సొంత విషయాలపై కథనాలు ప్రసారాలు చేస్తున్నారని వాపోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులను (Telangana Police) ఆశ్రయించాడు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, యూట్యూబ్ చానల్ నిర్వాకులను వదిలిపెట్టవద్దని స్పష్టం చేశాడు.
తన పరువుకు భంగం కలుగుతోందని సినీ నటుడు నరేశ్ (Naresh) ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనపై యూట్యూబ్ చానళ్లు (Youtube Channels) పని గట్టుకుని తప్పుడు ప్రచారాలు, అసభ్యకర కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించాడు. యూట్యూబ్ చానల్స్ వాళ్లు ఇష్టారీతిన తన సొంత విషయాలపై కథనాలు ప్రసారాలు చేస్తున్నారని వాపోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులను (Telangana Police) ఆశ్రయించాడు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, యూట్యూబ్ చానల్ నిర్వాకులను వదిలిపెట్టవద్దని స్పష్టం చేశాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో నటుడు నరేశ్ అందరికీ తెలిసిందే. మా (Movie Artists Association) ఎన్నికల సమయంలో ఆయన వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొన్నాళ్ల నుంచి నరేశ్ సోషల్ మీడియా (Social Media)లో ట్రెండింగ్ లో ఉంటున్నాడు. అతడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్ (Pavitra Lokesh)తో కలిసి జీవించబోతున్నట్లు 2022 డిసెంబర్ 31న ఒక వీడియోతో నరేశ్ ప్రకటించాడు. ఆ వీడియో మామూలు వైరల్ కాలేదు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే తమ ఇద్దరి విషయమై యూట్యూబ్ చానల్స్ వాళ్లు ఇష్టమొచ్చినట్టు ఏవేవో రాస్తున్నారని నరేశ్ వాపోయాడు. వాటిపై చిరాకు వచ్చిన నరేశ్ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు (Hyderabad Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు. కొన్ని చానల్స్ పేర్లు కూడా ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా ఈ చానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తున్నది. దీనిపై గతంలోనే ఫిర్యాదు చేయగా మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి విచారణ వేగవంతం చేయాలని కోరాడు.
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘గతంలో నాపై, సినీ పరిశ్రమపై అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేసిన పలు యూట్యూబ్ చానళ్లకు సంబంధించిన వివరాలను పోలీసులకు సమర్పించాను. ఈ విషయమై గతంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. కోర్టులో కూడా కేసు కూడా వేశా’ అని గుర్తు చేశారు. ‘పని గట్టుకుని కొన్ని మీడియా చానళ్లు మాపై మరీ ట్రోలింగ్ చేస్తున్నాయి. అసత్య ప్రచారాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాను. వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశా. సినీ పరిశ్రమ, మీడియా కలిసి పని చేయాలి’ అని నరేశ్ తెలిపాడు.
కాగా నరేశ్ కు అతడి రెండో భార్య రమ్య రఘుపతితో వివాదం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా రమ్యకు దూరంగా ఉంటున్నాడు. అయితే పవిత్ర లోకేశ్ తో కొన్నాళ్లుగా సహ జీవనం చేస్తున్నాడు. పలుచోట్ల వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ క్రమంలోనే పవిత్ర లోకేశ్ తో కలిసి నరేశ్ హోటల్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా రమ్య రఘుపతి పట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి నరేశ్ వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. త్వరలోనే పవిత్ర లోకేశ్ ను నరేశ్ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వీరిద్దరూ కలిసి ఉంటున్నారని టాక్.