»Mirzapur Actor Shahnawaz Pradhan Demised With Heart Stroke In Mumbai
అవార్డు ఫంక్షన్ లో కుప్పకూలిన Mirzapur నటుడు.. అంతలోనే
ఓ అవార్డు వేడుకలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అల్లాడుతూ అందరూ చూస్తుండగానే ఆయన తుది శ్వాస విడిచాడు. దీంతో ఆ అవార్డు వేడుక విషాదంగా ముగిసింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ పద్ధతిలో బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు.
హిందీ సినీ పరిశ్రమ (Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. మీర్జాపూర్ (Mirzapur Web Series) ఫేం నటుడు షానవాజ్ ప్రధాన్ (56) కన్నుమూశాడు. ఓ అవార్డు వేడుకలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అల్లాడుతూ అందరూ చూస్తుండగానే ఆయన తుది శ్వాస విడిచాడు. దీంతో ఆ అవార్డు వేడుక విషాదంగా ముగిసింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ పద్ధతిలో బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ‘లగాన్’ (Lagaan) నటుడు యశ్ పాల్ శర్మ (Yashpal Sharma) సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
‘ముంబై (Mumbai)లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యా. వందలాది మంది నటీనటులతో సభా ప్రాంగణం కళకళలాడుతోంది. అంతలోనే అవార్డు అందుకున్న షానవాజ్ (Shahnawaz Pradhan) అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయాడు. వెంటనే అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఆపివేసి షానవాజ్ ను ఆస్పత్రికి తరలించాం. కానీ ఆయనను బతికించుకోలేకపోయాం. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారు’ అంటూ యశ్ పాల్ శర్మ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని బాలీవుడ్ నటీనటులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
హిందీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన షానవాజ్ తెలుగులో మాత్రం ఆయన ముఖం తెలియకున్నా ఆయన స్వరం మాత్రం అందరికీ తెలుసు. సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావుకు డబ్బింగ్ చెప్పే వ్యక్తి షానవాజ్. దూకుడు, బృందావనం, అతడు, జులాయి, రేసు గుర్రం, రచ్చ, చత్రపతి, మున్నా తదితర సినిమాలకు షానవాజ్ డబ్బింగ్ చెప్పారు. ఇక నటుడిగా బాలీవుడ్ లో ప్యార్ కోయ్ ఖేల్ నహీ, ఫాంటమ్, రేస్ సినిమాల్లో నటించిన షానవాజ్ ‘అలిఫ్ లైలా, హరి మిర్చి లాల్ మిర్చి, బంధన్ సాత్ జన్మోన్ కా’ వంటి సీరియల్స్ లో నటించి మెప్పించారు. ఇక వెబ్ సిరీస్ లు వరుస పెట్టి చేశారు. బెటర్ లైఫ్ ఫౌండేషన్ సిరీస్ చేయగా అనంతరం మీర్జాపూర్ సిరీస్ (Mirzapur Series) లో షానవాజ్ నటించాడు. అతడి నటనకు ఓటీటీ ప్రియులు ఫిదా అయిపోయారు. అతడి కెరీర్ లో మీర్జాపూర్ సిరీస్ కీలకమైంది. అనంతరం హోస్టేజెస్ సిరీస్ లో కూడా నటించారు.