Naresh: నా రివాల్వర్‌కు లైసెన్స్ ఇవ్వండి.. ఆమెను చంపేస్తా..?
తన రివాల్వర్‌కు లైసెన్స్ ఇవ్వాలని సినీయర్ నటుడు నరేశ్ శ్రీ సత్యసాయి ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. గతంలో తనకు లైసెన్స్ ఉండేదని, దానిని రెన్యువల్ చేయలేదని గుర్తుచేశారు. తన ప్రాణాలకు థ్రెట్ ఉన్నందున లైసెన్స్ ఇవ్వాలని కోరారు.
Naresh: సినీయర్ నటుడు నరేశ్ తన గన్ లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నాడు. అతని మూడో భార్య రమ్య రఘుపతి మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఇంతలో అతను తన గన్‌కు లైసెన్స్ ఇవ్వాలని అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికిప్పుడు లైసెన్స్ తీసుకొని ఏం చేస్తారనేదే చర్చ.. నరేశ్ మాత్రం తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతున్నాడు. ఆత్మరక్షణ కోసమే తన గన్‌కు లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నాడు.
తనకు ప్రాణహాణి ఉందని.. రక్షణ కోసం రివాల్వర్‌కు లైసెన్స్ ఇవ్వాలని శ్రీ సత్యసాయి ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. పుట్టపర్తిలో గురువారం ఎస్పీని కలిసి రిక్వెస్ట్ చేశారు. మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని 2008లో రివాల్వర్ పొందాడు నరేశ్. గతంలో పర్మిషన్ ఇవ్వాలని కోరగా స్పందించలేదు. ఇప్పుడు రెన్యువల్ చేయాలని కోరారు. హిందూపురంలో ఉంటున్నానని.. రివాల్వర్‌కు లైసెన్స్ ఇస్తే తన వద్ద పెట్టుకుంటానని చెబుతున్నారు. నరేశ్ రిక్వెస్ట్‌పై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని నరేశ్ చెబుతున్నారు.
రమ్యతో గొడవల నేపథ్యంలో లైసెన్స్ ఇచ్చేందుకు కూడా పోలీసులు ముందు వెనకా ఆలోచించే పరిస్థితి. రేపు జరగరానిదీ ఏమైనా జరిగితే అంతే సంగతులు. అందుకోసమే అతని రిక్వెస్ట్‌పై ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి కాగా.. వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. విడాకులు తీసుకోకుండానే పవిత్ర లోకేశ్‌కు నరేశ్ దగ్గర అయ్యారు. ఇద్దరు కలిసి రిలేషన్ షిప్లో ఉన్నారు. ఇటీవల తీసిన మళ్లీ పెళ్లి మూవీ రచ్చ రచ్చ అయ్యింది. ఆ సినిమా ప్రదర్శించొద్దని రమ్య కోరారు. చివరికీ థియేటర్లో ప్రదర్శించారు. ఓటీటీపై అభ్యంతరం తెలుపగా.. ఆపివేశారు.