Land Dispute: ఇది కలికాలం.. ఏ బంధాలు, బంధుత్వాలు లేవు. అన్ని ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి. రిలేషన్ షిప్స్ గురించి ఇటీవల ‘బలగం’ అనే సినిమా వచ్చింది. ఆ మూవీ చూసి అయినా సరే జనాల్లో మార్పు వస్తుందనే చర్చ జరిగింది. కానీ అలాంటిదేమీ లేదు.. కొందరు మారడం లేదు. తమకు భూమి, జాగా, ఆస్తి, అంతస్తు కావాలని అంటున్నారు. అడ్డొస్తే చంపేందుకు కూడా వెనకాడటం లేదు. ములుగు (Mulugu) జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలువనుంది.
వాజేడు మండలం ఇప్పగూడెంలో అన్నదమ్ములు చంటి- శివాజీ ఉన్నారు. ఇద్దరికీ భూములకు సంబంధించిన వివాదం నెలకొంది. గత కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంతలో తమ్ముడు శివాజీ (shivaji) క్షణికావేశానికి గురయ్యాడు. భూ వివాదంలో తన అన్న చంటిపై (chanti) బరిసేతో దాడి చేశాడు. పొడవడంతో చంటి తీవ్రగాయాలై.. చనిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు శివాజీని (shivaji) అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి రిమాండ్కు తరలించారు.
తల్లి (mother) పేగు తెంచుకొని పుట్టిన అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి పంపకాల విషయంలో జరుగుతున్న తేడాల వల్ల కోపోద్రిక్తులు అవుతున్నారు. చంపేందుకు కూడా వెనకాడటం లేదు. తన అన్న (brother), లేదంటే తమ్ముడు ప్రాణాలు తీసి సాధించేది ఏంటీ అని ఆలోచించడం లేదు. తమకు కావాల్సింది భూమి, జాగా అని మాత్రం అనుకుంటున్నారు. ఒక్క ఇప్పగూడెంలోనే కాదు.. చాలా చోట్ల ఇలా సోదరులు, కూతుళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏ సినిమా/ వెబ్ సిరీస్ చూసినా ఫలితం ఉండటం లేదు. సందేశం ఇచ్చే మూవీస్ చూసి.. అప్పటివరకే ఇన్స్పైర్ అవుతున్నారని.. వారిలో సమూల మార్పులు రావడం లేదని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.