»Revanth Reddy Announced 10 Lakhs For Singer Rahul Sipligunj
Revanth Reddy : ఆస్కార్ విన్నర్ కు రూ.10లక్షలు ప్రకటించిన రేవంత్ రెడ్డి
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాటకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని కాంగ్రెస్ తరఫున ప్రకటించారు. శుక్రవారం బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
Revanth Reddy : ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie)లోని నాటు నాటు సాంగ్కు(Naatu naatu song) గాను ఆస్కార్ అవార్డు(Oscar Award) గెలుచుకున్న రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj) ను ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి(Tpcc Revanth reddy) ఆరోపించారు. రాహుల్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని కాంగ్రెస్ తరఫున ప్రకటించారు. శుక్రవారం బోయిన్ పల్లి(Boinpally)లో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్(Rajiv Gandhi Online Quiz Competition Program) ప్రారంభానికి రాహుల్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా రాహుల్ వచ్చాడని.. జూన్ 2న జరిగే క్విజ్ ప్రోగ్రాంలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేందుకు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
జూన్ 2వ తారీఖున రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే అతనికి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా అప్పుడే అందజేస్తామన్నారు. ఇవాళ రాహుల్ సిప్లిగంజ్ వచ్చినప్పుడు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబం నుంచి ఆస్కార్ స్థాయికి వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ ను కేసీఆర్ సర్కార్ సన్మానిస్తుందని అనుకున్నాను.. కానీ ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పడుతుందని.. అపుడు కోటి రూపాయల నగదు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ తెలిపారు.