Medigadda: తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరానికి ముఖ్య ఆయకట్టగా మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో నిర్వాహణ లోపాలు ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అంతేకాకుండా మేడిగడ్డ ప్రాజెక్టులో మూడు పిల్లర్లు నెర్రలు వచ్చాయి అని ఎమ్మెల్యేలు సందర్శించడానికి నేరుగా అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. తరువాత డ్యామ్ సేఫ్టీ అధికారులు దాన్ని పరిశీలించి వర్షకాలంలోపు వీటి మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కంపెనీ మరమ్మత్తు పనులు చేపట్టింది.
రాబోయేది వర్షకాలం కావడంతో బరాజ్ వద్ద సేఫ్టీ చర్యలను వెంటనే చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. వరద ప్రవాహాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా.. అలాగే వరద ఉదృతికోసం గేట్లను తెరిచి ఉంచాలని, ఇసుక, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ సంస్థకు ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాంతో మేడిగడ్డ బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తనున్నారు. అయితే అక్కడ పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన పిల్లర్ గేట్లను ఎత్తడానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.