రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రాజెక్టు(kaleshwaram project)లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల అంశంపై దీనిని నిర్మించిన L&T సంస్థ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డిజైన, నాణ్యత మేరకు నిర్మించామని..అవసరమైతే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project)లో ఇటివల అక్టోబరు 21న సాయంత్రం బ్లాక్ 7లోని పిల్లర్లో కొంత భాగం పగుళ్లు ఏర్పడింది. ఇది లక్ష్మీ బ్రిడ్జి (మేడిగడ్డ బ్యారేజీ)( Medigadda) లోని బ్లాక్ 7లో జరుగగా..ఈ అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్(congress), బీజేపీ(BJP) పార్టీలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తీరు సహా ఈ ప్రాజెక్టు నిర్మించిన L&T సంస్థపై కూడా ఆరోపణలు చేశాయి. నాణ్యత లేకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో L&T సంస్థ ఎట్టకేలకు తాజాగా స్పందించింది.
అయితే రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాల మేరకే తాము ఈ ప్రాజెక్టు ఆనకట్ట నిర్మించి 2019లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ క్రమంలో మేడిగడ్డ(Medigadda) ఆనకట్టు ఐదు సార్లు వరద వచ్చినా కూడా తట్టుకుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆనకట్ట విషయంలో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత దెబ్బతిన్న ప్రాంతాన్ని పునురుద్ధరించే చర్యలు తీసుకుంటామని సంస్థ వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టు దెబ్బతిన్న అంశంపై పలువురు అధికారులు పరిశీలించి నివేదికను కేంద్రానికి అందించారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ ప్రాజెక్టులో లీకేజీల అంశంపై ప్రతిపక్ష నేతలతోపాటు స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చిన ప్రతి సారీ బ్యాక్ వాటర్ వచ్చి అనేక ప్రాంతాలు జలమయం అవుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు తాజాగా లేకేజీలు అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఈ ప్రాజెక్టును కేసీఆర్ తన కమిషన్ల కోసమే నిర్మించారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు జరిగే లాభం కంటే సీఎం కేసీఆర్(KCR) కుటుంబానికే ఎక్కువ లాభం చేరుకుందని అంటున్నారు.