CM Revanth: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించడనాకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బస్సులో బయలుదేరింది. ఈ రోజు అసెంబ్లీహాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ రావును ఉద్దేశించి కాళేశ్వర రావు, కేసీఆర్ ఇద్దరు కూడా మేడిగడ్డ సందర్శనకు వస్తే బాగుంటుందని ఎద్దేవ చేశారు. వీరితో పాటో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రావాలని కోరారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని అన్నారు. అందుకనే కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ఓ హెలికాఫ్టర్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో ఇష్టారీతిగా ఖర్చులు పెంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్‌కి పగుళ్లు వచ్చాయి అని ప్రతిపక్షాలను ఆందోళన చేస్తే భారీగా పోలీసులను పెట్టి బ్యారేజ్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్‌ను గత ప్రభుత్వం దాచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేశారని అని కూడా మాట్లాడారు అని అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపట్టి, భూమిలో కుంగిపోయేలా కట్టారు అని అన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణం నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు.
అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్న ప్రజా ప్రతినిధుల బృందం.