చికోటీ ప్రవీణ్..(Chikoti Praveen) అలియాస్ క్యాసినో ప్రవీణ్.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కేసినోలు( Casino) నిర్వహించడం, వాటికి ప్రముఖులను ఆహ్వానించడం చేశాడు. క్యాసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు, మనీ లాండరింగ్ అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ (ED )పల మార్లు విచారించిన సంగతి తెలిసిందే.
చికోటీ ప్రవీణ్..(Chikoti Praveen) అలియాస్ క్యాసినో ప్రవీణ్.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కేసినోలు( Casino) నిర్వహించడం, వాటికి ప్రముఖులను ఆహ్వానించడం చేశాడు. క్యాసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు, మనీ లాండరింగ్ అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ (ED )పల మార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో సినీ, రాజకీయ ప్రముఖులు పేర్లు బయటపడటం కలకలం రేపింది.చీకోటి ప్రవీణ్ ఇంట్లో దొంగలు పడ్డారు.సైదాబాద్(Saidabad) లోని చీకోటి ఇంట్లోకి చొరబడ్డి గుర్తు తెలియని వ్యక్తులు కారుని దొంగిలించారు. ఇన్నోవా కారు కీస్ వెతికి మరీ కార్ తో దుండగులు పరారయ్యారు. కేసినో డాన్ ప్రవీణ్ ఇంటి దగ్గర కలకలం రేగింది. కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ఆయన ఇంటి దగ్గర రెక్కీ(Recki) నిర్వహించారు.
ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున కారుతో ఉడాయించారు. అయితే, దుండగులు కారు కోసమే వచ్చారా? చీకోటి హత్యకు రెక్కీ నిర్వహించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చీకోటి ప్రవీణ్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కారు చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తనకు పోలీస్ ప్రొటెక్షన్ (Protection)కావాలని గతంలోనే పోలీసులకు చీకోటి విజ్ఞప్తి చేశాడు. తనకు, తన కుటుంబానికి రక్షణగా గన్ మెన్స్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. తన ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా, క్యాసినో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రవీణ్.. కొన్ని రోజుల క్రితం పోలీస్ ప్రొటెక్షన్ కోరాడు. తనకు విదేశాల (Abroad) నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపాడు. హిట్ మెన్ అనే విదేశీ యాప్‌లో సుపారీ ఇచ్చామని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని పోలీసులను రిక్వెస్ట్ చేశాడు.
భద్రత కోసం హైకోర్టు( High Court )లోనూ పిటిషన్ వేసినట్లు అతడు గతంలో వెల్లడించాడు. ఈడీ అధికారుల విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించాడు. చీకోటి ప్రవీణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలతో చీకోటి చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణలో సినీ, రాజకీయ ప్రముఖులు పేర్లు బయటపడటం కలకలం రేపింది.చీకోటి ప్రవీణ్.. దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు ఇది. క్యాసినో కాట్రాజ్ గా చీకోటి ప్రవీణ్ గుర్తింపు పొందాడు. దేశ విదేశాల్లో క్యాసినో నిర్వహించడంలో చీకోటి దిట్ట. ఈ క్రమంలో క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ముమ్మరంగా విచారణ చేస్తోంది. విదేశాల్లో క్యాసినో దందాలో జరిగిన హవాలా (Hawala) లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది.