»Prime Minister Modi Road Show In Hyderabad Rtc X Road
Hyderabad:లో ప్రధాని మోడీ రోడ్ షో షురూ
హైదరాబాద్‌లో ప్రధాని మోడీ(modi) రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు కొనసాగనుంది.
Prime Minister Modi road show in Hyderabad rtc x road
నేడు (నవంబర్ 27న)హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 3 కి.మీల మోడీ(modi) రోడ్‌షోకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు RTC X నుంచి ప్రారంభమైంది. మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత నారాయణగూడ, YMCA కాచిగూడ జంక్షన్ల మీదుగా సాగి, చివరికి కాచిగూడలోని వీర్ సావర్కర్ విగ్రహం వద్ద ముగుస్తుంది. ముఖ్యంగా ఈ స్మారక కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి చీఫ్ జి కిషన్ రెడ్డి, బిజెపి ఒబిసి మోర్చా చీఫ్ కె లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Standing behind two barricades Bharatiya Janata Party workers await Prime Minister Narendra Modi in Chikkedpally in #Hyderabad for the road show. pic.twitter.com/SOk9VAFU3H
అయితే ఈ రోడ్‌షో కేవలం రాజకీయ ఉద్వేగాన్ని ప్రదర్శించడమే కాదు. రాబోయే ఎన్నికలలో తమ అవకాశాలను పెంచుకోవడానికి బిజెపి వేసిన వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోడీ రాక నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల మధ్య పలు ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కాచిగూడ X రోడ్ల వరకు వివిధ పాయింట్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.