Pravallika ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం: పోలీసులు
ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమించిన శివరామ్‌కు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని స్పష్టం చేశారు.
Pravallika: ప్రవళిక (Pravallika) ఆత్మహత్యకు కారణం లవర్ శివరామ్ రాథోడ్ అని పోలీసులు స్పష్టంచేశారు. ప్రవళికను అతను మోసం చేశాడని చెబుతున్నారు. మరో యువతితో పెళ్లి చేసుకోబుతున్నట్టు చాటింగ్ ద్వారా గుర్తించామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. ఆ విషయం తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్యకు గల ప్రాథమిక కారణం లవర్ శివరామ్ అని స్పష్టంచేశారు.
ప్రవళిక చనిపోయిందని శుక్రవారం రాత్రి సమాచారం వచ్చిందని.. గదిలో సూసైడ్ నోట్ లభించిందని ఆయన చెప్పారు. ప్రవళిక ఇప్పటివరకు ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదని.. గ్రూప్-2 పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చిందని తెలిపారు. శివరామ్ రాథోడ్‌తో ప్రవళిక చేసిన చాటింగ్ గుర్తించామని వివరించారు. వారిద్దరు సిటీలో ఓ హోటల్ వెళ్లినట్టు ఫుటేజీ దొరికిందని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రవళిక ప్రేమ గురించి ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసు అని డీసీపీ చెబుతున్నారు.
ప్రవళిక మొబైల్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాం అని.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు. ప్రవళిక వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకుందని.. గ్రూప్2 పరీక్ష వాయిదాకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్థులు చెప్పారని.. విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు అనవసరంగా ఆందోళనకు దిగారని చెప్పారు.
ప్రవళిక స్వస్థలం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి. అశోక్ నగర్ హాస్ట్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. శుక్రవారం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే ప్రవళిక చనిపోయింది. పరీక్ష వాయిదా పడటంతో సూసైడ్ చేసుకుందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి వరకు మృతదేహం హాస్టల్లో ఉంచి ఆందోళనకు దిగారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రేమ వ్యవహారం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తేల్చారు.