»The Governor Tamilisai Soundara Rajan Should Give A Report On Pravallika Death Within 48 Hours
Governor tamilisai: ప్రవల్లిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి
హైదరాబాద్‌లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
The governor tamilisai soundara rajan should give a report on Pravallika death within 48 hours
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రవల్లిక(23)(Pravallika) మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎస్, డీజీపీ, TSPSC సెక్రటరీకి ఆదేశాలిచ్చారు. అయితే వరంగల్‌కు చెందిన ప్రవల్లిక అనే 23 ఏళ్ల యువతి అశోక్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆమె తెలంగాణలో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతుంది. అయితే ఇటివల రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో తాజాగా డీఎస్సీ ఎగ్జామ్ సహా గ్రూప్ 2 వంటి అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఈ నేపథ్యంలో వరుస రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేయడంతో ఆమె మనస్తాపానికి గురైనందున ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆమె మృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె హాస్టల్ వద్దకు పెద్దఎత్తున ఉద్యోగార్థులు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసనకు(protest) దిగారు. పోలీసులను ప్రాంగణంలోకి రానీయకుండా అడ్డుకున్నారు.
మరోవైపు శుక్రవారం రాత్రి ప్రవల్లిక తన గదిలో శవమై కనిపించిందని పోలీసులు చెప్పారు. పరీక్షలను రద్దు చేసిన తీరుపై ఆమె మనస్తాపం చెందిందని ఆమె స్నేహితులు ఆరోపించగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలను నిగ్గుతేల్చుతున్నామని పోలీసులు(police) చెబుతున్నారు. ప్రవల్లికకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ, రిక్రూట్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది ఔత్సాహికులు, బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ముందు ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు ప్రవల్లిక తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభించారు.