Pm Modi Urged Girl: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిన్న మాదిగల విశ్వరూప బహిరంగ సభ జరిగింది. మాదిగల గురించి ప్రధాని మోడీ (Pm Modi) చాలా సేపు మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఓ యువతి విద్యుత్ స్తంభం ఎక్కింది. గమనించిన మోడీ.. కిందకి దిగాలని కోరారు. ఆమె దిగకపోవడం.. నినాదాలు చేయడంతో.. ఒకింత ఆందోళనకు గురయ్యారు మోడీ (Pm Modi).
విద్యుత్ సిబ్బంది జోక్యం చేసుకోవాలని.. ఆమెను కిందకు దించాలని ప్రధాని మోడీ కోరారు. కిందకు వస్తే.. సమస్యను పరిష్కరిస్తానని మోడీ హామీనిచ్చారు. అక్కడున్న సిబ్బంది ఆమెను కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
సభ నిర్వహించించిందే.. మాదిగల కోసం.. అలాంటి సభలో మిగతా అంశాలు ఏముంటాయని కొందరు.. మందకృష్ణ మాదిగ కోరిక మేరకు రిజర్వేషన్ వర్గీకరణ కోసం కమిటీ వేస్తామని.. అప్పటికే మోడీ ప్రకటించారని ఇంకొందరు అంటున్నారు. అలాంటప్పుడు సమస్య ఏముంటుందని అడుగుతున్నారు. ఆ యువతి వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రధాని మోడీ హావాభావాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి.