అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డ బాలరాజుకు అచ్చంపేటలో చికిత్స అందజేసి.. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.
MLA Guvvala Balaraju: తెలంగాణ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. పోలీసులు ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ.. తయీలాల పంపిణీ జరుగుతూనే ఉంది. అలా నిన్న రాత్రి అచ్చంపేటలో బీఆర్ఎస్- కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఆ దాడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) గాయపడ్డారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో ఉప్పునుంతల మండలం వెల్టూర్ గేట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు (congress workers) అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వాహనం ఆపకపోవడంతో వెంబడించారు. అచ్చంపేట అంబేద్కర్ కూడలిలో అడ్డుకుని వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలరాజు (Guvvala Balaraju), కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకున్నారు. వారిద్దరూ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఎమ్మెల్యే వాహనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డారు. అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పోలీసులు బీఆర్ఎస్కు సహకరిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టారు.
వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమచారం ఇచ్చిన అడ్డుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు. డబ్బు సంచులు పట్టించిన ఎందుకు చూపించలేదని అడిగారు. బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కారులో తీసుకెళ్తుంది ఫోటో కెమెరాలకు సంబంధించిన సంచులని సీఐ అనుదీప్ స్పష్టంచేశారు.