కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్.. సవాల్ విసిరారు. తాను చెప్పేది తప్పయితే… తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చెప్పారు. అదే.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాంయిపుల విషయమై రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొన్నారని 2014లో టీడీపీలో గెలిచిన తలసానిని మంత్రిని చేశారని అన్నారు. ఇక 2018 వరకు ఫిరాయ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా? తానొకటి తలిస్తే, మరొకటి జరిగి ఇరుకున పడ్డారా? ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మధ్య చిక్కుకుపోయారా? మునుగోడు కోసం వేసిన స్కెచ్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ పెడుతోందా? కోర్టులో వరుస షాక్‌లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తొలిచివేస్తున్న అంశాలు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఫామ్ హౌస్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇ...
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు ఎటువైపు వెళ్తున్నాయో, వెళ్తాయో అర్ధం కానీ పరిస్థితి. ఓ వైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌ను తప్పించింది అధిష్టానం. అదే సమయంలో సీనియర్లు రేవంత్‌ను తొలగించాలని చెప్పినప్పటికీ, ఆయననే కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికలను ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మధ్యేమార్గంగా ఇరువురిని చల్లబరిచే ప్రయత్నాలు చేస...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా గ్రామాల రైతులు బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బంద్ కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామార...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ప్రణాళిక-శిక్షణ కార్యక్రమం బుధవారం బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లను అసహనానికి గురి చేశాయట. సాధారణంగా ఓ పార్టీ నాయకుడిపై మరో పార్టీ నేత విమర్శలు సహజమే. కా...
సీఎం కేసీఆర్ కోసం తాము చావడానికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో ఏం చదువుకోని వారిని హెల్త్ మినిస్టర్లను చేశారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పట్లో అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని, కానీ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అంశాల మీద పట్టున్న వారికి పదవులు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఎలా వస్తావని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస...
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను నియమించారు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం ఇరువర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నది. మాణిక్కం ఠాకూర్ తొలగింపుకు రేవంత్‌కు...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ స్కాం పై కూడా ఆయన స్పందించారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదని అన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఢిల్లీ లిక...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2023 సంవత్సరం ఎంతో కీలకం కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్యాలెండర్ ఏడాది(2023) అయిన ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలం పార్టీకి కాస్త సానుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏడాదిన్న...
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తికి ఫుల్‌స్టాప్ పడలేదా? అధిష్టానం చర్యలతో వారు కూల్ కాలేదా? పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మార్పుతో సంతృప్తిగా లేరా? రేవంత్ రెడ్డి తీరును వారు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదా? ఇటీవల కొన్ని పార్టీ కార్యక్రమాలను చూస్తే కాంగ్రెస్‌లో అసంతృప్తి రాగానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపించింది. బుధవారం భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జ...
బాలయ్య అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో… సెకండ్ సీజన్ మరింత సూపర్ డూపర్ గా దూసుకుపోతంది. సెకండ్ సీజన్ లో ఊహించని విధంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయుకులు కూడా వచ్చారు. కాగా… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ షోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ తో పాటు [&hell...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాలలో పోటీ చేస్తే పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ అనేసరికి ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుండి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. కొంతమంది పార్టీ రావొచ్చు.. పోటీ చేయవచ్చు కానీ విభజన సమస్యలను ఎలా పరిష్కరి...
హైదరాబాద్ లో మెట్రో సిబ్బంది ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. నేడు కూడా మెట్రో సిబ్బంది విధులకు గైర్హజరై… ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద వీరి ధర్నా కొనసాగుతోంది. ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని టికెటింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా 11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. ఈక్రమంలోనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టికెంటింగ్ సిబ్బంది వ...
విభజన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడితే ఇరుకున పడతామని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుందా? జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు అధిష్టానం సూచిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. పలువురు తో...