WGL: నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
JGL: మైనార్టీ ఈ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. తుర్క కాశి ముస్లిం వర్గానికి టూల్ కిట్లు, జనరేటర్ల పంపిణీ, మైనార్టీ యువతకు ఈ-స్కూటర్ల పంపిణీ పథకానికి ఈనెల 20 నుంచి మార్చి 1 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
MBNR: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాన అవకాశాలు, సహకారం లభించినప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్ దుర్గా రామ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కూకట్‌పల్లి డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న దుర్గా రామ్ కుమార్ కామారెడ్డి జిల్లాకు బదిలీపై రానున్నారు.
GDWL: జిల్లాలో పెండింగ్ ఉన్న భూభారతి దరఖాస్తులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం IDOC కార్యాలయంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం RDO స్థాయిలో 1370 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా క్లియర్ చేయాలని సూచించారు.
SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ మూల వాగులో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మూల వాగులో తాళ్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాక్టర్‌లో ఇసుక నింపుకొని వాగులో నుంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆంగ్ల మాధ్యమంలో బోధించే అభ్యర్థులకు నేడు (శనివారం) మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాలని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని పేర్కొన్నారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రెండు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించిందని జిల్లా మైనారిటీ అధికారి వి.జగదీశ్వర్ తెలిపారు. tgobmms పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.1.50 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.20 లక్షల సబ్సిడీ, ముస్లిం బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారికి రూ.60వేల యూనిట్ విలువతో పథకం అమలు చేస్తున్నామన్నారు.
SRCL: దివ్యాంగులకు ఆర్థిక పునరవాస సహాయ పథకానికి ఇంటర్వ్యూలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాకు ఆర్థిక సహాయ పునర్వాస పథకం కింద 14 యూనిట్లు మంజూరయ్యాయి. 30 మంది దరఖాస్తు చేసుకోగా 35 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్టిఫికెట్లు, అర్హత పత్రాలు పరిశీలించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి వివరాలు తెలిసిన వారు 8712656546 నంబర్‌ను సంప్రదించాలని SI తహసీనుద్దీన్ పేర్కొన్నారు.
JGL: బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని బంజారా భవన్‌లో శుక్రవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బంజారా సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు.
KNR: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు.
GDWL: గడువులోగా పని పూర్తి చేయకుంటే మిమ్మల్ని ఇంటికి పంపడానికైనా వెనుకాడం అని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా తహసీల్దార్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీవో స్థాయిలోనే 1370 భూభారతి ఫైళ్లు మూలన పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సామాన్యుడి కన్నీరు తుడవని రెవెన్యూ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు.