• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోం: హరీశ్ రావు

MDK: BRS పార్టీ రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, BRS నాయకులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని హెచ్చరించారు. ఈసారి KCR కాళ్లు మొక్కైనా సరే అతిగా ప్రవర్తించిన అధికారులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:50 AM IST

‘విద్యార్థులు సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలి’

KMR: విద్యార్థులు తప్పనిసరిగా సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. కామారెడ్డిలోని ZPHS పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ యొక్క స్క్రీన్ ప్రభావం వల్ల చూపు మందగించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

February 21, 2026 / 11:48 AM IST

‘విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి’

KMM: పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని డీఐఈవో రవి బాబు ఆకాంక్షించారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని ఇవాళ తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

February 21, 2026 / 11:48 AM IST

మున్సిపల్‌లో ఉర్దూ బోర్డు కోసం డిమాండ్

MBNR: జడ్చర్లలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయంలో ఉర్దూ భాషలో బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ముస్లిం మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉర్దూ మాట్లాడే వారు అధికంగా ఉన్నందున రెండో అధికార భాషను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ వెంటనే ఉర్దూ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 11:48 AM IST

అంతర్జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో ఆర్టీసీ ఉద్యోగి సత్తా

KNR: యూఏఈలోని అబుదాబిలో ఓపెన్ మాస్టర్ గేమ్స్ విలువిద్య (ఆర్చరీ) పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆర్టీసీ KNR జోనల్ వర్క్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న కూన కిషన్ పాల్గొని సత్తా చాటాడు. ఆర్చరీ విభాగంలో 40-50 వయస్సులో 50 మీటర్ల టార్గెట్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా కూన కిషన్‌ను ఆర్టీసీ వీసీ ఎండి వై.నాగిరెడ్డి బస్ భవన్‌లో శాలువా కప్పి అభినందించారు.

February 21, 2026 / 11:48 AM IST

‘మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి’

ADB: సోనాల మండలంలోని దేవల్ నాయక్ తాండకు చెందిన గ్రామ పెద్దలు నెరడిగొండలోని MLA నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పలు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 11:48 AM IST

కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు

HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ. 8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. ఈ టవర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు రూపొందించారు.

February 21, 2026 / 11:47 AM IST

మున్సిపాలిటీ బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్

SRCL: వేములవాడ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పుల్కం రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజు అభిమానులు తెలిపారు.

February 21, 2026 / 11:47 AM IST

మంచినీటి కోసం పైప్ లైన్ ఏర్పాటు

MDK: నిజాంపేట మండల పరిధిలోని షాకత్‌పల్లిలో శనివారం మంచినీటి పైప్‌లైన్ పనులను సర్పంచ్ సునీతబాబు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.

February 21, 2026 / 11:43 AM IST

‘పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలి’

RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బసవేశ్వర్‌ను వీర శైవ సమాజం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, లింగ వర్ణ వివక్ష లేకుండా, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేసి మున్సిపాలిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

February 21, 2026 / 11:40 AM IST

ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం: KTR

HYD: SLBC సొరంగం ప్రమాదం జరిగి ఏడాదికావస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజా శ్రేయస్సుపై శ్రద్ధపెడితే ఇలాంటి విషాదాలు జరగవని ట్వీట్ చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలోకానీ సొరంగం పనుల్లోగాని ఎటువంటి పురోగతి లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు.

February 21, 2026 / 11:35 AM IST

‘మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా’

KMM: మధిర మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన కోన ధని కుమార్‌ని కోన వారి కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సాధించిన ఈ విజయాన్ని కుటుంబ గౌరవంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కోన ధని కుమార్ స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:33 AM IST

‘పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు’

ASF: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారాం శనివారం ప్రకటనలో తెలిపారు. నిత్యం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గడువులోగా లక్ష్యం చేధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:33 AM IST

‘ఓటరు జాబితాను సరి చేసుకోవాలి’

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సరి చేసుకోవాలని తహశీల్దార్ రజనీకుమారి సూచించారు. ఓటర్ జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తొలగించే కార్యక్రమం చేపడుతున్నామని, ఎవరైనా చనిపోతే బీఎల్ఓ వద్ద ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసి చనిపోయిన వారి పేరు తొలగించాలని సూచించారు. ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉందని అన్నారు.

February 21, 2026 / 11:27 AM IST

ఫార్మర్ రిజిస్టీకి మరో 7 రోజులే గడువు..!

NLG: ఫార్మర్ రిజిస్టీకి మరో 7 రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్టీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 11:25 AM IST