• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాత బజార్లోనే శంకరయ్య నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 11:20 AM IST

SRSP కాల్వ వంతెనపై ఆటో-బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఎస్సారెస్పీ కాల్వ వంతెనపై ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగిలిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి (36), బైక్‌పై ఉన్న గజ్జెల సురేష్ (35) తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.

February 20, 2026 / 11:19 AM IST

పేదలకు వరం.. ఇందిరమ్మ ఇల్లు: ఛైర్మన్

VKB: పేదలకు వరం ఇందిరమ్మ ఇల్లు అని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం 2వ వార్డులోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చింతకాయల మొగులమ్మ గృహప్రవేశానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 11:19 AM IST

రైతులకు డిజిటల్ కార్డు.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

SRPT: నడిగూడెం మండలం కర్వీరాల క్లస్టర్ పరిధిలోని రైతులందరూ వెంటనే ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని ఏఈవో ఉప్పయ్య ఇవ్వాళ సూచించారు. భవిష్యత్తులో పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల లబ్ధికి ఇది తప్పనిసరని తెలిపారు. దీని ద్వారా రైతులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డు లభిస్తుందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 11:18 AM IST

అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: MLA

HNK: వర్దన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కోరారు. GWMC 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామంలో పోచమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణంకు భూమిపూజ, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి శుక్రవారం MLA భూమిపూజ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.

February 20, 2026 / 11:18 AM IST

కామారెడ్డి నుంచి జుక్కల్‌కు బస్సులు

కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి జుక్కల్‌కు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పులు ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 20, 2026 / 11:17 AM IST

అక్రమ ఇసుక రవాణా… పట్టించుకోని అధికారులు

BDK: మణుగూరు మండల పరిధిలోని కమలాపురం గ్రామం సమీప గోదావరి నది నుంచి నిత్యం అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామం మీదగానే ట్రాక్టర్లు అదుపు లేకుండా విపరీత వేగంతో సంచరిస్తుండటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయని నేడు స్థానికులు చెబుతున్నారు.

February 20, 2026 / 11:17 AM IST

మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన

SRD: హత్నూర మండలంలోని నాగులదేవుపల్లిలో గురువారం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ చాముండి శిరీష, సంఘం అధ్యక్షురాలు బాయికాడి లావణ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భ్రమరాంబ, ఉప సర్పంచ్ మాణిక్యం, వార్డు సభ్యులు అరుణ, గణేశ్, మీనా, మాజీ సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి ఈ భవనం దోహదపడుతుందని తెలిపారు.

February 20, 2026 / 11:17 AM IST

హెల్త్ సెంటర్‌లో కాయకల్ప బృందం తనిఖీ

MDK: కౌడిపల్లి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మిర్జాపూర్ కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలో పరిశుభ్రత, పచ్చదనం, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రి పనితీరుపై ఆరా తీశారు. వైద్య సేవలు, నిర్వహణ పట్ల సూపరింటెండెంట్ సంతృప్తి వ్యక్తం చేస్తూ డాక్టర్లను అభినందించారు.

February 20, 2026 / 11:16 AM IST

జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

NGKL: నాగర్‌ కర్నూల్ పేరు వెనుక చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్‌ కర్నూల్‌‌గా రూపాంతరం చెందింది. నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.

February 20, 2026 / 11:14 AM IST

వృక్షాల నరికివేత… ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు

NLG: చిట్యాల నుంచి ఉరుమడ్ల, నేరడ దారుల్లో, పెద్దకాపర్తి లోకి వెళ్లే దారిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన హరితహారం వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు మొండెం వరకు నరికివేశారు. ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ఇలా నిర్దాక్షిణ్యంగా రంపంతో కోయడం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

February 20, 2026 / 11:13 AM IST

అనారోగ్యంతో మున్సిపల్ ఉద్యోగి మృతి

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వేల్పుల భీమయ్య అనే ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్, కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, విజయరాణి తిరుపతి, మున్సిపల్ అధికారులు సాయికుంటలోని నివాసానికి వెళ్లి భీమయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు.

February 20, 2026 / 11:11 AM IST

ఎల్లమ్మ, పొచ్చమ్మ గుడుల్లో చోరీ కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ RRO కాలనీలో ఎల్లమ్మ, పొచ్చమ్మ గుడుల్లో అర్థరాత్రి దొంగతనం జరిగింది తాళాలు పగులగొట్టి 2 హుండీలు, బంగారు నగలు, వెండి కిరీటాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఇద్దరు అనుమానితులు రికార్డు అయినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 11:10 AM IST

మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.10 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని, చేవెళ్ల మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 20, 2026 / 11:09 AM IST

వరంగల్ మార్కెట్లో ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,550 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,800 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 37,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 18వేలు, టమాటా మిర్చి రూ. 37వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 20, 2026 / 11:06 AM IST