దొంగతనం ఘటనతో ప్రస్తుతం ఆలయ అభివృద్ధిపై కొంత వెనుకడుగు పడినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ ఆలయంలో చోరీకి గురవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకున్నారు.
కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.
D Srinivas unwell:సీనియర్ నేత డీ శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బంజారాహిల్స్‌లో గల సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్యులు ఆధునాతన ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
Preethi face caste abuse:మెడికో ప్రీతి (Preethi) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆమె మరణానికి గల కారణాలను సోదరి (Preethi sister) మీడియాకు వివరించారు. క్యాంపస్‌లో ప్రీతికి (Preethi) కులం పేరుతో వేధించేవారని చెప్పారు. అలా ముగ్గురు వల్ల తన అక్క ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.
ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఆలయ పాలక మండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ ఉత్సవాల సందర్భంగా భారీ భక్తులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో తోచక పక్కన కనిపించిన ఓఎమ్ఆర్ షీట్ తీసుకున్నట్లు చెప్పాడు. తాను తప్పు రాసిన షీట్ ను చించివేసి వాటిని మింగేసినట్లు ముఖీద్ వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడి నోటి నుంచి కొన్ని ఓఎంఆర్ షీట్ ముక్కలను అధికారులు సేకరించారు.
కళల (Arts)కు కాణాచిగా తెలంగాణ విలసిల్లుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోంది. ఎన్నో అద్భుత కళలకు నిలయంగా ఉన్న తెలంగాణ (Telangana)లో పేరిణి నృత్యం (Perini Dance) ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దైవ భక్తితో కూడిన ఈ నృత్యం చేయడం కత్తి మీద సాములాంటిది. భక్తితో పాటు నవరసాలను ఒలికించడం ఈ నృత్యం ప్రత్యేకత.
ఐఏఎస్ (IAS) కావాలన్న తన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు ప్రీతి నాయక్ (Preeti Nayak). ప్రీతి ఐఏఎస్ కావాలని భావించింది.
గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అనూహ్యంగా గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా.. వర్కౌట్లు (Workouts) చేస్తుండగా.. ఏ పని చేస్తున్నా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి.
వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది.
మెడికో ప్రీతి(Preeti) ఆదివారం రాత్రి 9.16 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలె మెడికో ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చేర్చి చికిత్స అందిస్తుండగా నేడు కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం వరకూ కోలుకుంటోందని చెబుతూ వచ్చిన వైద్యులు సాయంత్రం తర్వాత పరిస్థితి విషమించినట్లు తెలిపారు.
వరంగల్(Warangal) ఎంజీఎం(MGM)లో సీనియర్ వేధింపులు తాళలేక విద్యార్థి ప్రీతి(Preethi) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి(Preethi)కి నిమ్స్(NIMS) ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే ప్రీతి(Preethi) ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని నిమ్స్(NIMS) వైద్యులు వెల్లడించారు. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందిస...
గాంధీ హాస్పిటల్ (Gandhi hospital) లో పేషంట్ వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు (Raja Rao) తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.