• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి: ఘనపురం మండలం సోలిపురం గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోలిపురంలోని బాధిత కుటుంబాన్ని పరమర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని కుటుంబానికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 AM IST

దొంగ వస్తువులు కొనుగోలు.. యజమాని అరెస్ట్

ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్‌వెల్ పైపులను దొంగలించి ముజాహిద్‌కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 06:37 AM IST

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు.

February 22, 2026 / 06:33 AM IST

బైక్‌ను ఢీ కొన్న ట్రాక్టర్.. ఇద్దరకి తీవ్ర గాయాలు

MNCL: మందమర్రి పట్టణం పులిమడుగు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

February 22, 2026 / 06:32 AM IST

‘బిల్లును సకాలంలో చెల్లించి సహకరించాలి’

WGL: రాయపర్తి మండలం మైలారం సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సహకరించాలని సబ్ ఇంజనీర్ సయ్యద్ ముజాఫర్ అహ్మద్ కోరారు. ఆదివారం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక బిల్లుల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 22, 2026 / 06:30 AM IST

మాస్టర్ మైండ్ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మేయర్

RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్‌పేట్ డివిజన్‌లో ది మాస్టర్ మైండ్ స్కూల్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాజీ మేయర్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంస్థలు అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు.

February 22, 2026 / 06:30 AM IST

విధులకు రాకుండానే సంతకాలు..!

SRPT: నూతనకల్ మండలం పెద్దనేమిల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-2లోని సదరు టీచర్ 19న సెలవులో ఉండి కూడా హాజరు పట్టీలో సంతకం చేశారని, 21న ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, బాధ్యత రహితంగా వ్యవహారిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

February 22, 2026 / 06:29 AM IST

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

SRCL: జిల్లాలో ఈరోజు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం రద్దయినట్లు డిప్యూటీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

February 22, 2026 / 06:28 AM IST

‘సీఎం-కప్’ పోటీల్లో జిల్లా వాసికి బంగారు పతకం

NRPT: హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్-16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.

February 22, 2026 / 06:24 AM IST

‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’

NLG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి చివరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 06:24 AM IST

‘కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు’

NRML: తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.21 లక్షల నిధులు మంజూరైనట్లు MLA రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్రశిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. వీటితో విద్యార్థుల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

February 22, 2026 / 06:24 AM IST

నేడు తాండూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే

VKB: తాండూర్ ఎమ్మెల్యే నేడు జిణుగుర్తి గ్రామంలోని ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ గురుకుల ఆవరణలో నిర్వహించనున్న నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు హాజరుకానున్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

February 22, 2026 / 06:19 AM IST

రెండు వారాల్లో 134 DD కేసులు :CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.12.10 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే, 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వెల్లడించారు.

February 22, 2026 / 06:16 AM IST

నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ గడువు

ADB: SC స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుందని SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ ఆదివారం తెలిపారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9494149416 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 22, 2026 / 06:15 AM IST

CM కప్ బాక్సింగ్ పోటీల్లో కాగజ్ నగర్ బాక్సర్‌లకు పతకాలు

ASF: సీఎం కప్, 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాగజ్‌నగర్‌కు చెందిన ముత్తు బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో ముగ్గురు క్రీడాకారులు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. యశ్వంత్ (52–54KGలు), హర్షిత (46-48KG ), శ్రేష్ఠ (44-46KG ) పతకాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన విజేతలను కోచ్‌లు, క్రీడాభిమానులు అభిమానించారు.

February 22, 2026 / 06:14 AM IST