నాగర్ కర్నూల్: కుమ్మెర జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం అమానుషమైన ఘటన అని బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు గడ్డం భరత్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. చిలుకేశ్వరం చాకలి చంద్రకళ దైవదర్శనం కోసం వెళ్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేసి, పసికందు మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మల్: కడెం మండలం అల్లంపెల్లిలోని జీయర్ గురుకులం విద్యార్థిని గోపు నిహారిక ఆర్చరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించింది. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి ‘సీఎం-కప్’ అర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
WGL: కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన డైరెక్టర్‌గా ఆరేపల్లి హవేలీ గ్రామానికి చెందిన దుకిరే వినయ్ కుమార్ నియమితులయ్యారు. రేపటి నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
MDK: ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని అభిప్రాయ భేదాలు ఉంటే చట్టబద్ధమైన, శాంతియుత మార్గాల్లో వ్యక్తపరచాలని MP రఘునందన్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతిస్తాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు గడువు ఈ నెల 28తో ముగియనుంది. రైతులు తప్పనిసరిగా గడువు లోపే నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూచించారు. జిల్లాలో మొత్తం 3,02,563 మంది పాస్ పుస్తకాలు కలిగిన రైతుల్లో 1,82,282 మంది రైతులు మాత్రమే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.
KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
NGKL: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఒక వరమని సర్పంచ్ భీమయ్య అన్నారు. కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కంఠం బాల్ చెన్నయ్య కు మంజూరైన రూ. 27000 విలువైన చెక్కును సర్పంచ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారు ప్రభుత్వం అందించే ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన అల్లం రమ-నాగేశ్వరరావును ఆదివారం ఉదయం 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన వైస్ ఛైర్మన్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామి ఉన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్ 11వ వార్డులో ఆదివారం మన్నె యాదగిరికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి MLA హరీష్ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. నిర్ణిత గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని పేర్కొన్నారు.
RR: లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో జరుగుతున్న గణపతి, అభయ ఆంజనేయ, శివాలయ, ధ్వజస్తంభ, నాభి శిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి షాద్‌నగర్ మూడవ వార్డు కౌన్సిలర్ అశోక్ రూ.1,30,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం, ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ విరాళం ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు.
NZB: NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్‌మెంట్ కల్పిస్తామని పేర్కొన్నారు.
MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు సమ్మేటివ్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమగ్రంగా సన్నద్ధం కావాలన్నారు.
VKB: పట్టణంలోని 26వ వార్డు ఇస్తా ఖాన్‌భాగ్ కాలనీలో కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ప్రజలను కరిచి గాయాలపాలు చేస్తున్నాయి. కుక్కల బెడదతో బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను నిర్మూలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
JGL: ధర్మపురి పట్టణంలోని గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి బోరుబావి, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు.