BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరంలోని షాపుల యజమానులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ ఇవాళ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుందని, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించేందుకు ఆధారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
SRPT: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఐడీఓసీలో తొమ్మిది ఆర్బీఎస్‌కే బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమిషానికి 100-120 సార్లు ఛాతీపై ఒత్తిడి కలిగించడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చని ఆయన వివరించారు.
NLG: చండూరు పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూజా కార్యక్రమాలు, ధ్వజారోహణ నిర్వహించనున్నారు. అనంతరం 50 జతల ఎద్దుల శకటంపై చేనేత మగ్గంతో పట్టు వస్త్రాల నేసే కార్యక్రమం, ఊరేగింపు జరుగనున్నాయి.
BHPL: రేగొండ(M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు గోరికొత్తపల్లి మండల నాయకులు హాజరై అన్నదానం వడ్డించి సహకరించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జ్ ఓం ప్రకాష్, NSUI మండల అధ్యక్షుడు రంజిత్, మాజీ వార్డు మెంబర్ కుమార్, నాలుగో వార్డు మెంబర్ అనిల్ పాల్గొన్నారు.
MDK: హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని అధికంగా ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. భూమి సారం తగ్గుతుందని తద్వారా పంట దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో శనివారం వ్యవసాయ అధికారి రాజకుమార్ ఆధ్వర్యంలో రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంటలకు సరైన ఎరువులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను ఆయన రైతులకు వివరించారు. అలాగే వారు వేసిన పంటలకు ఏ సమయంలో ఎంత మోతాదులో రసాయనాలు వాడాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, సర్పంచ్, ఉపసర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
MDCL: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్‌ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
RR: కొందుర్గు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. రాబోవు మూడు సంవత్సరాల్లో మండలం రూపురేఖలు మారబోతున్నాయని, మండల కేంద్రంలో రూ. 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొందుర్గు మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.
NLG: ఫిబ్రవరి 21న ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ సుందరయ్య భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అధ్యయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1848లో ఇదే రోజున వెలువడిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ స్మరణార్థం ఈ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సామాజిక మార్పు, సమానత్వం కోసం రాసిన అభ్యుదయ సాహిత్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జంగం విశ్వనాథ్ తన ఉదారతను చాటుకున్నారు. సైకాలజీ విభాగంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించేందుకు రూ.3 లక్షల చెక్కును వీసీ ప్రొ. కె. శ్రీనివాస్‌కు అందజేశారు. గత ఏడాది కూడా ఆయన అభ్యర్థుల కోసం రూ.3.5 లక్షల విలువైన పుస్తకాలను విరాళంగా ఇచ్చి అండగా నిలిచారు.
SRD: కంగ్టి గ్రామ శివారులోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆలయ ఈవో శివ రుద్రప్ప పర్యవేక్షణలో అర్చకులు స్థానికులు కలిసి హుండీని లెక్కించారు. గత ఐదు నెలల నుంచి హుండీ ద్వారా రూ. 72,525 ఆదాయం వచ్చినట్లు EO శివ రుద్రప్ప తెలిపారు. వచ్చిన ఆదాయంతో ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. ఇందులో సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, సంగమేశ్వర్ ఉన్నారు.
SRPT: కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు మాదిగ జిల్లా కమిటీని రద్దు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ఉద్యమానికి జిల్లా కమిటీ నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు.
MDK: తూప్రాన్‌లోని గీతా స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహతి తయారు చేసిన ‘వ్యర్ధాల నిర్వహణ- ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దక్షిణ భారత స్థాయితోపాటు, జాతీయస్థాయికి ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రాజెక్టులు ఎంపిక కాగా, జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.
ADB: పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో రిమ్స్ ఆసుపత్రిలోని SNCU విభాగానికి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు రూ. 5 వేల రివార్డు సాధించడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. శిశు ఆరోగ్య విభాగంలో ఇన్ఫెక్షన్ల రేటును గణనీయంగా తగ్గించడంలో మంచి ఫలితాలను సాధించాలని కొనియాడారు. ఈ మేరకు సిబ్బందిని ఆయన అభినందించారు.