JN: రాష్ట్రవ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత దశకు చేరుకుందని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
WNP: మదనాపురం మండలం దంతనూరు గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న ప్రజావాణిలో ఉండడంవల్ల రాలేకపోయానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృష్ణయ్య చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
MLG: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా MLG జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర మంత్రి సీతక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-11వ బొగ్గు గనిలో ఖాళీగా ఉన్న టైం రేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గుర్తింపు కార్మిక సంఘం (AITUC) నాయకులు గని మేనేజర్ మల్లేశంకు వినతి పత్రం ఇచ్చారు. నాయకులు నాయిని శంకర్ మాట్లాడుతూ.. యాజమాన్యం ముందుగా అంగీకరించి, తర్వాత నిర్లక్ష్యం చేస్తుందన్నారు. త్వరగా నోటీస్ బోర్డు ద్వారా ప్రకటించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు.
WNP: అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన పెబ్బేరు మండలం 44 జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదంలో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు వచ్చాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
కరీంనగర్‌లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ‘స్టాటిక్ ఫోర్స్’తో భద్రత కల్పించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.
SRPT: రైతు భరోసా నిధులను ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ఏవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పంటల బీమా అమలు చేయాలని, యూరియా యాప్ ఇబ్బందులను తొలగించాలని నేతలు కోరారు. మొంథా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
సిరిసిల్ల జిల్లాలో బుధవారం జరిగిన పదవ పరీక్షకు మొత్తం 11 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 34 పరీక్ష కేంద్రాల్లో 7308 మందికి గాను 7297 మంది హాజరయ్యారన్నారు. మొత్తం జిల్లాలో హాజరు 99.85 శాతంగా నమోదు అయిందన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అమ్మవారి దేవాలయాల్లో ఉగాది ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న, కమిషనర్ సతీష్ దగ్గరుండి పర్యవేక్షించారు. పట్టణంలో ఉగాది అతిపెద్ద పండుగ అని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ జరుపుకోవాలని కోరారు.
MDCL: అల్వాల్ సర్కిల్ పరిధి కనజిగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోమాల్లో పాల్గొనదలచిన భక్తులు గోత్రనామాలతో ఆలయ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
NRML: బాసర IIITలో విద్యార్థులను పోలీసులు దూషించారనే వార్తలను జిల్లా పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వాయిస్ మార్ఫింగ్ చేశారని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలు, విద్యార్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలు సృష్టించారని పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది.
MDK: జిల్లా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలన్నారు.
WNP: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ ప్రణాళికలో భాగంగా మార్చి 31లోపు 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీమా చేయించే బాధ్యతను బ్యాంకర్లు తీసుకోవాలని ఆదేశించారు.
SRD: కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకులకు సర్పంచ్ సౌజన్య మణిక్ రెడ్డి క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సుధీర్, ఉప సర్పంచ్ గోవిందరావు పాటిల్, నాగభూషణం, మోహన్, గంగారం, అఖిల్, గంగాధర్ ఉమాకాంత్ ఉన్నారు.
BHPL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా BHPL జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ కోరారు.