• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎల్లమ్మ దేవాలయంలో మున్సిపల్ ఛైర్మన్ ప్రత్యేక పూజలు

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. కౌన్సిలర్లు ప్రశాంత్, అశోక్, నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 11:06 AM IST

కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహుల నిరీక్షణ

మంచిర్యాల జిల్లాలో కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. గతంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లు, మేయర్, ఛైర్మన్‌లుగా బాధ్యతలు చేపట్టారు. ఇక కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక మిగలగా, ఆశావహులు MLA ల ఆశీర్వాదం కోసం వేచిచూస్తున్నారు.

February 23, 2026 / 11:05 AM IST

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

PDPL: ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఆదివారం కజ్జం రమణయ్య బంధువుల ప్రథమ వర్ధంతి కోసం ఆదిలాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ.10వేల నగదు అపహరించారు. గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరగడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 11:05 AM IST

నవోదయ విద్యాలయానికి రంగం సిద్ధం

BDK: అశ్వాపురం మండలం, భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించగా, సుమారు రూ. 80 కోట్లతో NBCC నిర్మాణం చేపట్టనుంది. ఈ విద్యాలయం ద్వారా జిల్లా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.

February 23, 2026 / 11:03 AM IST

ప్రజా సంక్షేమమే లక్ష్యం: MLA గూడెం

SRD: పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం 54 మంది లబ్ధిదారులకు రూ.24.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

February 23, 2026 / 11:01 AM IST

పులుల సంచారంపై అవగాహన కల్పించాలి: MLA

SRCL: జిల్లాలో పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కరాపేట వెళ్లే మార్గంలో పులులు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ సందర్శించారు. అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భయందోలనలపై అవగాహన కల్పించాలన్నారు.

February 23, 2026 / 11:01 AM IST

మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి

RR: అత్తాపూర్‌లో నూతనంగా నిర్మించిన ధన్వంతరి ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.

February 23, 2026 / 11:01 AM IST

జిల్లాకు రానున్న మాజీ మంత్రి

ADB: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించడానికి పట్టణానికి రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తెలియజేశారు.

February 23, 2026 / 11:01 AM IST

‘తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు’

NRML: నిర్మల్‌లో ఆదివారం జరిగిన సాధారణ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ASP సాయికిరణ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఒక కేసు, కారును ధ్వంసం చేసిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు నేటి ప్రకటనలో హెచ్చరించారు.

February 23, 2026 / 11:00 AM IST

గ్రామపంచాయతీలకు నిధులు విడుదల

BHNG: జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు జమ అయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు అందాయి. ఈ నిధుల్లో 60 శాతాన్ని తాగునీరు, పారిశుద్ధ్య పనులు, మిగిలిన 40 శాతాన్ని పెండింగ్ బిల్లులు, ఇతర అభివృద్ధి పనులకు మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

February 23, 2026 / 10:59 AM IST

సింగరేణిలో ఫీజు రియంబర్స్ చెల్లింపు

MNCL: 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రవేశం కోసం ట్యూషన్ ఫీజు రియంబర్స్ చెల్లింపుకు సంంధించించి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరంలో ఐఐటీలో ప్రవేశంపై వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఐఐటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు రశీదులు, ఇతర రుజువులతో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

February 23, 2026 / 10:57 AM IST

క్రీడల్లో ప్రతిభ చాటిన అచ్చంపేట బిడ్డ

NGKL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి “వుషూ” క్రీడా పోటీల్లో పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్ అచ్చంపేట విద్యార్థి శివప్రసాద్ పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాల, అచ్చంపేటకు కీర్తి తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

February 23, 2026 / 10:53 AM IST

పొంగుతున్న డ్రైనేజీ.. దుర్గంధంతో ఇబ్బంది

NLG: చిట్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న 8వ వార్డులో భూగర్భ డ్రైనేజీ సమస్యతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీరు సాఫీగా పారక బయటకు పొంగుతోంది. దుర్గంధంను స్థానికులు భరించలేకపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 23, 2026 / 10:47 AM IST

తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్ గా జిల్లా బిడ్డ

GDWL: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా గద్వాల కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధా రెడ్డి తెలిపారు. గుజరాత్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పీడీలు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 10:47 AM IST

బోధన సామర్థ్యం పెంచుకోవాలి: హెచ్‌ఎం శారద

SRD: ముత్తంగి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం శారద మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా బోధన నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని ఆమె సూచించారు.

February 23, 2026 / 10:45 AM IST